అంకురం ఫౌండేషన్ చాలా మంది పబ్లికేషన్స్ వారితో మాట్లాడిన తర్వాత నేర్చుకుందేమిటంటే మీ పుస్తకానికి భారత్ లో ఉన్నంత డిమాండ్ దేశం బైట కూడా వుంది। కాకపోతే, షిప్పింగ్ ఖర్చు చాలా ఎక్కువ। మా స్థాపకుడు ఈ మధ్య ₹6,000 కి పుస్తకాలు విజయవాడ నుండి అమెరికా తెప్పించుకుంటే షిప్పింగ్ ₹12,000 అయ్యింది। కొనే విధానం కూడా కష్టమే। అమెరికా రాత్రివేళ కూర్చుని ఫోన్లు చేయాలి (అదీ ఒక్క సారి కాదు। అందరూ ఫోన్లు ఎత్తరు)। అంటే మీ పుస్తకం కొనే ఆసక్తి వున్నవాళ్ళకి అది వున్నట్టుగా తెలియదు, తెలిసినా ఒక్క పుస్తకం కోసం షిప్పింగ్ చేయడం కష్టం।
తెలుగు పుస్తకాలు చదవాలని వున్నవారందరూ అంత శ్రమ తీసుకోరు। అంత ఓపిక వుండదు కూడా। ఈ కారణాల వల్ల నష్టపోతున్నది మీరే। మీరు కష్టపడి వ్రాసిన ఆ పుస్తకం చదవాలనుకునే ప్రతి తెలుగువాడి చేతుల్లో వుంచేలాగా వుండాలి। ఇంగ్షీషు పుస్తకాల్లాగా న్యూజిలాండ్ దగ్గరనుంచి అమెరికా దాకా ఏ దేశంలో నైనా సరే అందుబాటులో వుండాలి।
కాకపోతే, ప్రస్తుత పరిస్థితి మేం చెప్పినంత సులభంగా లేదు। కాపీ దొంగతనం మనకు బాగా ఎక్కువ. ఎవర్నీ నమ్మలేము. pdf ఫైళ్ళు ఇంటర్నెట్ లో సులభంగా దొరుకుతున్నాయి। ఫ్రీగా దొరికే పుస్తకానికి డబ్బులు ఎవరు కడతారు?
ఇక్కడే ఒక శుభవార్త. భారత్ లో మనం ఏమీ చెయ్యలేకపోయినా దేశం బైట మంచి అవకాశం వుంది. కాకపోతే, మీరు రచయితైనా కొద్దిగా స్వంత వ్యాపారం చేసేవారిగా వుండాలి। వివరాలకి క్రింద ఫారంలో మీ ఫోను నెంబరు ఇవ్వండి. మేము ఫోను చేస్తాం।